మూడు రోజుల కింద బెంగళూరులో తెలంగాణకు చెందిన జంట ఆత్మహత్య చేసుకున్న వార్త చదివా. అబ్బాయి హిందూ, అమ్మాయి ముస్లిం. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే. భర్త ఆత్మహత్య చేసుకుంది చూసి.. భార్య కూడా సూ*సైడ్ చేసుకుంది. సరే.. ఆ రోజుకు అది మర్చిపోయాను. కానీ దాని ఫాలోఅప్‌గా ఇండియా టుడేలో ఒక స్టోరీ వచ్చింది. అది చదివిన తర్వాత చాలా బాధేసింది. గుండెను పిండేసినంత బాధ. ఆ స్టోరీ చదువుతున్నంత సేపు.. నాకు వాళ్లిద్దరూ కళ్ల ముందు కనపడ్డారు. ఆ కథేంటో మీకూ చెప్తాను..
భాను చందర్ రెడ్డి, షాజియా.. ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఆ స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకునే వరకు వచ్చింది.