శృంగేరి వారి స్వయం ప్రకటిత రాజపత్రం ఉదయం నుంచి భలే చక్కర్లు కొడుతోంది 🤣🤣🤣
( ఆలయము లేదు ఆగమము లేదు కానీ ఆలయాల పై పట్టు కావాలి )😔😔
బ్రాహ్మణ సమాజంలో అందరూ కూడా దీనిని తీవ్రంగా ఆలోచించాలి భగవంతుని అనుగ్రహం వల్ల వచ్చిన కొన్ని అవకాశాలను కూడా వదిలేయండి అని చెప్తున్నారు వాళ్ళు ...😔😔
ఏ గైడ్ లైన్స్ అయినా కూడా ఆయా ఆలయానికి ఆయా సంప్రదాయాలు ఆగమాలకు అనుగుణంగా ఉంటాయి...
ప్రభుత్వం కూడా అదే చెప్పింది... 🌹🌹
అసలు ఎటువంటి ఆలయము ఆగమాలు లేనటువంటి వారు "ప్రామాణికం" జారీ చేయడానికి ఉన్నటువంటి అర్హత ఏంటి ...
పైగా వారి సంప్రదాయం కానటువంటి ఆలయాలలో...
శైవ వైష్ణవ శాక్తేయ ఆగమాలతో నడిచే ఆలయాలకు ఇవ్వకూడదు...😔😔
శృంగేరీ వారి నిబంధనలు అద్వైతం పాటించే రామకృష్ణ మఠం (దక్షిణ భారత శాఖలు), చిన్మయ మిషన్ (దక్షిణ భారత శాఖలు), రమణ మహర్షి ఆశ్రమం, కంచి, పుష్పగిరి, విశాఖ పట్నం శంకర పీఠాలు, రమణానంద, పరిపూర్ణానంద, గణపతి సచ్చిదానంద వంటి వారి ఆశ్రమాలు, బ్రహ్మం గారి మఠం, సత్యసాయి ట్రస్టు, రమణ మహర్షి ఆశ్రమం, స్మార్తులు పూజారులుగా ఉండే సాయిబాబా ఆలయాలు, భావాతీత ధ్యాన కేంద్రాలు, శ్రీశ్రీ, జగ్గీ వాసుదేవ్ ఆశ్రమాలు - వీటికే వర్తిస్తాయి తప్ప సగుణ ఉపాసన చేసే వైష్ణవ శైవ ఆలయాలకు వర్తించవు.👍👍
ఇంకా కావాలి అంటే సాయిబాబా ఆలయాలకు ఇవ్వవచ్చు ...
ముఖ్యంగా గుండు బాస్ రమణానంద అటువంటి వాళ్లకు...
గుండు బాస్ అంటే గుర్తొచ్చాడు ఐదు ఇంచుల పైపుతో శివుడికి అభిషేకం చేయమని చేస్తూ ఉంటాడు కదా అటువంటి వాళ్లకు చెప్పవచ్చు ...
కొన్ని కీలకమైన అంశాలు:
*భారతీయ ధార్మిక వర్గాలు అన్నిటికీ శృంగేరి పీఠం ప్రమాణాలు వర్తిస్తాయా??
ధార్మిక విషయాలపై పెత్తనాన్ని తమకు తాము ఆపాదించుకున్నట్లు ఉన్నాయి ...
*శృంగేరి పీఠం ఒక వర్గానికి చెందిన ఆలయాలకు చెప్తే చెప్పవచ్చు... వారు ఇష్టమైతే పాటిస్తే పాటించవచ్చు..అన్ని ఆలయాలకు శృంగేరి పీఠానికి సంబంధం ఏమిటో?? పైగా ఆ పీఠం వారికి ఎటువంటి ఆలయాలు ఆగమాలు లేవు అయినా పెత్తనం కావాలి... 🤔
*ఇలాగే శృంగేరి పీఠం వారివి అనుసరించాలని ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీచేస్తే...రేపటినుండి...అన్ని పీఠాలు ఏవేవో జారీచేస్తాయి?? అసలు ఆ పీఠానికి ఉన్న అర్హత ఏంటి...?
ప్రభుత్వం అన్నిటినీ అమలు చేస్తుందా??
*ఒకప్పుడు ప్రభుత్వమే విదేశాలలో కళ్యాణాల స్కీమ్ అమలు చేసింది..తిరుమల వంటి పెరుమాళ్ళ కల్యాణాలు ప్రభుత్వమే ఎంకరేజ్ చేసింది.. అప్పుడు ఆ స్కీమ్స్ ఏమవుతాయి?? ప్రభుత్వం అమలు చేసిందికనుక వారికి ఏమి శిక్ష వేస్తారు.??
*అర్చకుల నియామక పత్రాలలో విదేశయానం(ఉత్సవాలు) చేయరాదని నిబంధన ఇచ్చారా??
*అర్చకులు అసలే విదేశయానం చెయ్యరాదా?? అక్కడ పూజాదికాలు చెయ్యరాదా??
స్పష్ట వివరణ కావాలి.
*విదేశాలు అసలే వెళ్లరాదంటే హక్కుల భంగం..
వెళ్ళవచ్చు కానీ ఉత్సవాలు చెయ్యరాదంటే....అలా ఆపగలరా?? సీక్రెట్ గా చెయ్యరని గ్యారంటీ ఏమిటి??
*ప్రభుత్వం ఆలయ విధి విధానాలలో శృంగేరి పీఠం ఉత్తర్వులు మాత్రమే పాటించాలని లేదా పాటిస్తుంది అని ఎక్కడైనా మార్గదర్శకాలు లేదా నిబంధనలు లేదా ప్రకటనలు, నోటిఫికేషన్స్ ఏమైనా ఇచ్చిందా??
*ఆ మేరకు అసెంబ్లీ లో ఏదైనా బిల్లు పాస్ చేశారా?
*వివిధ ఆగమాలు, శాస్త్రాల ప్రకారం నడిచే వివిధ సంప్రదాయాల ఆలయాలలో శృంగేరి నిబంధనలు ఎలా వర్తిస్తాయి?? వారికి ఆలయాలు ఆగమాలు లేవు..
ఇలా అనేకం technicalities ఉన్నాయి ఇందులో.
ఇది కోర్టులో నిలువదు.
ఒకసారి గమనించండి:-🙏
సన్యాసులు వాహనాలను ఎక్కరాదు.
భగవత్పరముగా తప్ప బంగారం మొ.గు వాటిని ముట్టరాదు, తాము ధరించరాదు.
పట్టుబట్టలను, జరీ అంచుబట్టలను ధరించరాదు
మరి తురుష్కులు ఇచ్చినటువంటి ఆభరణాలు ధరించి శృంగేరి వారు ఎలా ఊరేగుతున్నారు...?
అనిచయో భిక్షుః
(డబ్బులను కూడబెట్టరాదు.
తమ పేరిట బ్యాంకులలో
ఉంచరాదు)
నైకరాత్రిం గ్రామే వసేత్
( ఒక గ్రామంలో
ఒక్కరాత్రికంటే
నివసించరాదు)
ఇలాంటి గౌతమాది స్మృతివాక్యాలను పాటించాలికదా!
కాలానుగుణంగా అని జవాబిస్తే ఇవీ...సర్వదేశధర్మ
ప్రచారంలో భాగంగా ఎందుకు
భావించరాదు...ఇత్యాదులూ
చోద్యములే.
ఉభయరాష్ట్రాల సమన్వయకర్తను శృంగేరీ ఆస్థానంనుండి తొలగించండి.
(క్రాఫులు, ముఖక్షవరాలు, హోటలు భుక్కులు మొదలైనవి చేస్తున్నారు )
అలాగే
ఆస్థాన జ్యోతిష్య పండితులు
మొ.వారు
సంస్థానాలకు ,
పీఠాలకు,
వారి అంతర్మందిరాలకు ఎందుకు వర్తించదు?
వీళ్లకు వర్తించకుండా వీళ్ళు ఆలయాలకు ఎలా సుద్దులు చెప్తారు.....?
ఆయా పీఠాలలో ఏమి జరుగుతున్నదో??ముందు వీళ్ళు పాటిస్తున్నారా? లేదా?
వేషభాషలపరంగా కనీసపు నియమాలను పాటించనివారిని ఇలా పీఠాలలో అధికారాలను ఇవ్వడం ద్వారా వైదికులైనవారందరికీ ఏ సంకేతాలను ఇస్తున్నారు?
అక్కడ చేయవచ్చునా?
అమెరికాలో కూడా ఈ పీఠాల అనుబంధాల ఆలయాలున్నాయి.
అక్కడ చేయవచ్చునా?
అదైనా దేవుని పట్ల అపచారంకాదా?
దేశకాలమానాలను బట్టి కొన్ని అనివార్య మార్పులు ఉంటాయని తెలియదా...?
వీరు మార్పులు చేసుకోలేదా?
ప్రభుత్వం కూడా కేవలం ఒక సంప్రదాయ పీఠ సూచనలనే ఎలా పరిగణనలోకి తీసుకుంటారు. ఇది సరైనది కాదు కదా?
Note :-( ఇంకొకసారి ఎవరైనా అర్చకులు విదేశాలలో ఉన్న వారి యొక్క కుటుంబ సభ్యులను చూడటానికి లేదా అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే చూయించుకోవటానికి కూడా వెళ్లకుండా ఆలయానికే పరిమితం అయిపోవాలి అని చెప్పినట్టుగా ఉంది )
#everyonefollowers Nara Chandrababu Naidu Nara Lokesh Pawan Kalyan