# 👏👏👏 తెలుగు సినిమా పరిశ్రమలో కెరీర్ ప్రారంభించి తిరుగులేని హీరోయిన్స్ గా రా...
Canonical: https://social-archive.org/kiran/gpQaXRCuyK
Original URL: https://www.facebook.com/ksrikaruna/posts/pfbid035Kcm3ULL2SzmTP681m7AMGW3BZZwA7UkVKqMLWq7YiBvwdFU7gvagDWFVnZpC5Dpl
Author: Sri Karuna
Platform: facebook
## Content
👏👏👏 తెలుగు సినిమా పరిశ్రమలో కెరీర్ ప్రారంభించి తిరుగులేని హీరోయిన్స్ గా రాణించిన వారు ఎంతో మంది ఉన్నారు. వారిలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రద ఒకరు. జయప్రద తెలుగు చిత్రసీమలో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి రాణించింది. జయప్రద డేట్స్ కోసం స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్లు క్యూ కట్టేవారు. కేవలం తెలుగులోనే కాదు హిందీ, తమిళ్ లోనూ సినిమాలు కూడా చేసి రాణించింది జయప్రద . అంతేకాదు కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ రాణించింది. 😓😓😓 అయితే సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న అందాల నటి జయప్రద జీవితం వృత్తిపరంగా ఎంత విజయవంతమైందో, వ్యక్తిగతంగా అన్ని సవాళ్లతో నిండిపోయింది. సినీ, రాజకీయ కెరీర్ లో జయప్రద అగ్రస్థానానికి చేరినప్పటికీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం జయప్రద కోరుకున్న ఆనందాన్ని, స్థిరత్వాన్ని పొందలేకపోయింది. 🤔🤔🤔 జయప్రద అసలు పేరు లలితారాణి. ఆమె ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో పుట్టింది . జయప్రద తండ్రి కృష్ణారావు తెలుగు సినిమా ఫైనాన్షియర్ కాగా, తల్లి నీలవేణి గృహిణి. జయప్రద తన 13వ సంవత్సరంలోనే తొలిసారిగా నటనారంగ ప్రవేశం చేసింది. ఆ సమయంలో జయప్రదకు లభించిన పారితోషికం కేవలం పది రూపాయలు మాత్రమే. ఒక తెలుగు చిత్రంతో అరంగేట్రం చేసిన జయప్రద తక్కువ కాలంలోనే బాలీవుడ్ లో ప్రవేశించి, ఆ కాలంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా గుర్తింపు పొందింది. జయప్రద తన కెరీర్ లో బాలీవుడ్ లోని అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, రాకేష్ రోషన్, జితేంద వంటి అగ్ర నటులతో కలిసి నటించింది. 🤔🤔🤔 ముఖ్యంగా జితేంద్ర, జయప్రద జోడి ప్రేక్షకులకు చాలా దగ్గరై, పలు విజయవంతమైన చిత్రాలలో భాగమైంది. వరుస విజయాలతో దూసుకుపోయి, కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నప్పటికీ, జయప్రద వ్యక్తిగత జీవితం మాత్రం ఏంతో వివాదాస్పదంగా మారింది. 😓😓😓 1986 ఫిబ్రవరిలో జయప్రద నిర్మాత శ్రీకాంత్ నహతాని వివాహం చేసుకుంది. అయితే, అప్పటికే శ్రీకాంత్ నహతాకు చంద్ర అనే మహిళతో వివాహం జరిగి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శ్రీకాంత్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోవడంతో జయప్రద వివాహ బంధం గందరగోళంగా మారింది. జయప్రదను వివాహం చేసుకున్న తర్వాత, శ్రీకాంత్ మొదటి భార్యకు మూడో సంతానం కలగడంతో జయప్రద, శ్రీకాంత్ మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. 😯😯😯 పైగా తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి శ్రీకాంత్ నిరాకరించడంతో జయప్రద ఈ పరిస్థితిని జీర్ణించుకోలేకపోయింది. చివరికి తన వివాహ బంధాన్ని వదులుకోవాల్సి వచ్చింది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఈ కలతలు జయప్రద కెరీర్ పైన కూడా తీవ్ర ప్రభావం చూపాయి. నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వకుండా పక్కన పెట్టేయడం ప్రారంభించారు. దాంతో తన కెరీర్ లో అత్యున్నత దశలో ఉన్నప్పటికీ, జయప్రద సినిమా పరిశ్రమను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇక సినిమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత, జయప్రద రాజకీయాల్లోకి ప్రవేశించి రాజకీయనాయకురాలిగా సక్సెస్ అయ్యింది. అయితే ఇప్పటికే సింగిల్ గానే ఉన్నారు జయప్రద. #JayaPrada #tollywood #actress #photogallery #photooftheday #trending #telugu #love #viral #foryou
